బాలీవుడ్ సినిమా చేస్తా.. కానీ అదే సమస్య

May 7 2021 @ 15:04PM

బాలీవుడ్ సినిమా చేయాలనుంది. అక్కడ నుంచి ఆఫర్ వచ్చి కథ నచ్చితే ఖచ్చితంగా ఒప్పుకుంటా. కానీ ఒకటే సమస్య అంటున్నాడు నాని. ఆ సమస్యే హిందీ భాష. నేను హిందీ మాట్లాడగలను కానీ ...బాలీవుడ్ సినిమా చేసేందుకు నాకొచ్చిన హిందీ సరిపోదు. హిందీ సినిమా చేయాలంటే కథ నాకు బాగా నచ్చి ఈ కథ కోసం నేను కొత్తగా తయారవ్వాలి.. హిందీ భాష మీద పట్టు సాధించాలన్న తపన నాలో కలిగేలా ఉండాలి. నాని బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త అనే భావన ప్రేక్షకులకు రాకూడదు. అలా ఎగ్జైట్ చేసే కథ వస్తే తప్పకుండా నటిస్తానంటున్నాడు. నేచురల్ స్టార్ అని టాలీవుడ్‌లో నానికి పేరుంది. బాలీవుడ్‌లో కూడా అదే పేరు రావాలంటే పాత్రలో లీనమయ్యేలా భాష మీద పట్టు సాధించాలని అభిప్రాయపడుతున్నాడు. మరి ఈ హీరోని ఎగ్జైట్ చేసే కథ బాలీవుడ్ మేకర్స్ నుంచి వస్తుందా రాదా వేచి చూడాలి. నాని నటించిన టక్ జగదీష్ రిలీజ్‌కు రెడీగా ఉంది. శ్యామ్ సింగరాయ్, అంటే .. సుందరానికి  సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.