AP News: చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు నాని నిరాకరణ

ABN , First Publish Date - 2022-08-06T17:49:26+05:30 IST

అమరావతి: ఢిల్లీలో జరగనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి మాజీ చంద్రబాబు (TDP President Chandra Babu Naidu) ఈ రోజు

AP News: చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు నాని నిరాకరణ

అమరావతి: ఢిల్లీలో జరగనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (TDP President Chandra Babu Naidu) ఈ రోజు సాయంత్రం హాజరవుతున్నారు. శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అయితే చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని (Nani) నిరాకరించారు. చంద్రబాబుకు బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) కోరగా దాన్ని నాని తిరస్కరించారు. కనీసం చంద్రబాబు దగ్గరకు వెళ్లేందుకు కూడా నాని ఇష్టపడలేదు. బహిరంగ నిరసన తెలిపేందుకే నాని ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టీడీపీలో చర్చకు దారితీసింది. తాజాగా చంద్రబాబు.. నాని ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఆయన హుషారుగానే కనిపించారు. మరి ఇంతలోనే ఏమైంది?

అసలు ఏమైందంటే...

ఏపీలో గత కొద్ది రోజులుగా కేశినేని నాని అంశం చర్చనీయాంశంగా మారింది. తన తమ్ముడు కేశినేని చిన్ని (Kesineni Chinni) కారు ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారని కేశినేని నాని కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గత ఎన్నికల్లో విజయవాడ (Vijayawada) నుంచి టీడీపీ ఎంపీగా కేశినేని గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో యాక్టివ్‌గానే ఉన్నారు. కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని కూడా టీడీపీలో ఉన్నారు. సడెన్‌గా కుటుంబ విభేదాలు బయటపడటం.. అదీ సొంత తమ్ముడిపై కేశినేని కేసు పెట్టడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి... టీడీపీ ఎంపీ కేశినేని తిరుగుబాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని.. 60 సీట్లు మాత్రమే గెలుస్తుందని.. అందుకే ఇప్పటి నుంచే టీడీపీ ఎంపీ కేశినేని నాని .. ఆ పార్టీ నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నేడు కేశినేని నాని వ్యవహరించిన తీరుతో ఈ ప్రచారం నిజమేనని అంతా భావిస్తున్నారు.


Updated Date - 2022-08-06T17:49:26+05:30 IST