విద్యార్థిని హత్య బాధాకరం

ABN , First Publish Date - 2021-02-28T05:31:52+05:30 IST

విద్యార్థిని అనూష హత్య బాధాకరం అని మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో అనూష కుటుంబసభ్యులను శనివారం ఆమె పరామర్శించారు.

విద్యార్థిని హత్య బాధాకరం
అనూషా తల్లిదండ్రులను పరామర్శిస్తున్న నన్నపనేని రాజకుమారి, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు

నన్నపనేని రాజకుమారి  

ముప్పాళ్ళ, సత్తెనపల్లి, నరసరావుపేటటౌన్‌, ఫిబ్రవరి27:  విద్యార్థిని అనూష హత్య బాధాకరం అని మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో అనూష కుటుంబసభ్యులను శనివారం ఆమె పరామర్శించారు. అనంతరం  సత్తెనపల్లిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కఠినచట్టాలు  ఉన్నప్పటికీ ఉన్మాదులు ఏమాత్రం భయపడటం లేదన్నారు. అనూష హత్యపై కళాశాల యాజమాన్యం కనీసం స్పందించలేదని తెలిపారు. అనంతరం నరసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఆమె మాట్లాడారు. అమ్మాయిని తీకువెళుతుంటే తోటిపిల్లలు కూడా ప్రతిఘటించక పోవటమేంటని ప్రశ్నించారు. సెల్‌ఫోన్ల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. వీటిపై నియంత్రణ ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గతంలో లేఖ రాశానని గుర్తుచేశారు. విశాఖ ఉక్కుపై ఉభయ రాష్ట్ర ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినదని, అధికారంలో ఉన్న పార్టీ ముందుండి పోరాడాలని, అన్ని పార్టీలు సహకరించాలన్నారు. అనూష హత్య కేసులో రాజకీయ లబ్ధి కోసమే ఉద్యమించారని వైసీపీ అనడం మంచిది కాదని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఆయా సమావేశాల్లో టీడీపీ మహిళా నేతలు వందనాదేవి, నాగజ్యోతి, ఉదయశ్రీ, లీలావతి, జాహ్నవి, లావణ్య, సంధ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్రకార్యదర్శి చౌటా శ్రీనివాసరావ తదితరులున్నారు. 

Updated Date - 2021-02-28T05:31:52+05:30 IST