జె-స్టోర్‌, జె-గేట్‌ సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-03T05:49:02+05:30 IST

విద్యాపరమైన అభివృద్ధిలో భాగంగా జె-స్టోర్‌, జె-గేట్‌ సేవలను ఉభయగోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలో పరిశోధకులకు అందిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ మొక్కా జగన్నాథరావు తెలిపారు.

జె-స్టోర్‌, జె-గేట్‌ సేవలు ప్రారంభం

 దివాన్‌చెరువు, డిసెంబరు 2: విద్యాపరమైన అభివృద్ధిలో భాగంగా జె-స్టోర్‌, జె-గేట్‌ సేవలను ఉభయగోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలో పరిశోధకులకు అందిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ మొక్కా జగన్నాథరావు తెలిపారు.   యూనివర్సిటీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన జె-స్టోర్‌, జె-గేట్‌ సేవలను అనుబంధ కళాశాలలకు షేర్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల్లోని పరిశోధకులను ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం అన్నివిధాల సహకారం అందిస్తోందన్నారు. జె-స్టోర్‌, జె-గేట్‌ ద్వారా ఇప్పటికే అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయం కోఆర్డినేటర్‌ కె.రమణేశ్వరి, ఆచార్య ఎస్‌.టేకి, ఆదిత్య విద్యాసంస్థల అధినేత శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-03T05:49:02+05:30 IST