AP News: నేను కారు కొనాలి అంటే బ్రాహ్మణి ఫైనాన్స్ ఇవ్వాలి: లోకేష్

ABN , First Publish Date - 2022-08-10T22:35:11+05:30 IST

స్త్రీశక్తికి తమ ఇల్లు ఉదాహరణ అని టీడీపీ నేత నారా లోకేష్ (TDP leader Nara Lokesh) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

AP News: నేను కారు కొనాలి అంటే బ్రాహ్మణి ఫైనాన్స్ ఇవ్వాలి: లోకేష్

అమరావతి: స్త్రీశక్తికి తమ ఇల్లు ఉదాహరణ అని టీడీపీ నేత నారా లోకేష్ (TDP leader Nara Lokesh) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మా అమ్మ మా కుటుంబానికి ఆదర్శం. నా భార్య, నా తల్లి వ్యాపారాన్ని పైకి తీసుకొచ్చారు. నేను కారు కొనాలంటే బ్రాహ్మణి (Brahmani) ఫైనాన్స్ ఇవ్వవలసిన పరిస్థితి ఉంది. మంగళగిరిలో మహిళా శక్తి అభ్యున్నతి సాధించాలి. మంచి చేయడానికి అధికారం అవసరం లేదు.. స్వంతంగా ఇంత మందికి శిక్షణ ఇప్పించగలిగాను. రేపు అధికారం లోకి వస్తే లక్షలాది మందికి శిక్షణ ఇప్పిస్తాం. శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి’’ అని లోకేష్ ఆకాంక్షించారు.

Updated Date - 2022-08-10T22:35:11+05:30 IST