వైసీపీకి నారా లోకేష్‌ సవాల్‌

ABN , First Publish Date - 2022-03-21T22:32:06+05:30 IST

పెగాసెస్‌ విషయంలో వైసీపీకి టీడీపీ నాయకుడు నారా

వైసీపీకి నారా లోకేష్‌ సవాల్‌

అమరావతి: పెగాసెస్‌ విషయంలో వైసీపీకి టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ సవాల్‌ విసిరారు. పెగాసెస్‌పై ఏ విచారణకైనా తాము సిద్ధమని ఆయన ప్రకటించారు. బాబాయ్‌  వివేకా హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణ చేయగలరా అని ఆయన సవాల్ విసిరారు. ఐదు రోజులుగా మద్యం, కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నామన్నారు. సారా మరణాలను సహజ మరణాలుగా కొట్టిపారేయడం బాధాకరమన్నారు. మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనేది క్లారిటీ లేదన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పారని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. 


కల్తీ సారాతో, కల్తీ మద్యంతో పేదలను వైసీపీ ప్రభుత్వం చంపేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు అన్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సప్షన్ అని ఆయన పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అని పిలిచేది ఇందుకేనని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా అని ఆయన నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయారని ఆయన పేర్కొన్నారు. 


మండలి బిజినెస్ లేకుండానే పెగాసెస్‌పై చర్చ పెట్టారని ఆయన ఆరో్పించారు. నిబంధనలకు విరుద్దంగా సభలో చర్చకు చైర్మన్ అనుమతించారని ఆయన మండిపడ్డారు. మద్యం మరణాలపై ప్రతి రోజూ చర్చకు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. పెగాసెస్‌పై తప్పుడు సమాచారంతో సభలో చర్చకు పెట్టారన్నారు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారంటున్నారని, భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి రాబోతుందని ఆయన జోస్యం తెలిపారు. 




Updated Date - 2022-03-21T22:32:06+05:30 IST