
అమరావతి : వైసీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పేర్కొన్నారు. నిన్న ఒక జర్నలిస్ట్(Journalist)పై శ్రీకాళహస్తిలో వైసీపీ నేత దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు. ‘‘ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులు అయిపోయారు. ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ వద్ద జర్నలిస్ట్ ఈశ్వర్‌పై వైసీపీ నేత, శ్రీకాళహస్తీశ్వర ఆలయం బోర్డు మెంబర్ జయశ్యాం అలియాస్ బుల్లెట్టు జయశ్యాం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈశ్వర్‌కి చెందిన స్థలాన్ని కబ్జా చెయ్యడమే కాకుండా ప్రశ్నించినందుకు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడటం దారుణం. జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడిన జయశ్యాంపై కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ స్థలాన్ని తిరిగి ఆయనకి చెందేలా చూడాలి’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.