విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: లోకేష్

ABN , First Publish Date - 2022-03-04T17:59:27+05:30 IST

బీసీ గురుకుల బాలుర పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేష్ అన్నారు.

విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: లోకేష్

అమరావతి: విజయనగరం జిల్లా, కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో నిద్రిస్తున్న 8వ తరగతి విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సొంత నియోజకవర్గంలో జరిగిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం తీవ్ర విచారకరమన్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని సురక్షితంగా చూసుకోవాల్సిన గురుకులాలను జగన్ రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడం లేదని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

Updated Date - 2022-03-04T17:59:27+05:30 IST