Wishes: చేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్

ABN , First Publish Date - 2022-08-07T14:23:36+05:30 IST

Amaravathi: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేనేత కళాకారులు, ఆధారిత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ

Wishes: చేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్

Amaravathi: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేనేత కళాకారులు, ఆధారిత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు నేత కార్మికులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పథకాల్లో కోత పెట్టాలని చూస్తోందని విమర్శించారు. చేనేతల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను వైసీపీ (YSRCP) ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. అరకొరగా కేవలం 20 శాతం మందికే అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకంలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు నూలు బిల్లు తప్పని సరి అని నిబంధన పెట్టడం దారుణమని పేర్కొన్నారు. ఈ నిబంధన విత్ డ్రా చేసుకుని నేతన్న నేస్తం చేనేత కళాకారులందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.   

Updated Date - 2022-08-07T14:23:36+05:30 IST