Nara Lokesh: మనుషులా.. పశువులా?.. వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-31T00:08:50+05:30 IST

కుప్పంలో అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ..

Nara Lokesh: మనుషులా.. పశువులా?.. వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు

చిత్తూరు (chittoor): కుప్పం (Kuppam)లో అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh)  తీవ్రంగా ఖండించారు. కుప్పం అల్లర్లలో అరెస్టై  జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులతో ఆయన ములాఖత్‌ అయ్యారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు (Chandrababu) అన్నా క్యాంటీన్ ప్రారంభించాలనుకున్నారని.. వైసీపీ తన కుక్కలను పంపించి అడ్డుకుందని లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడితే దాడులు చేస్తున్నారని.. 5 వేల మంది టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కుప్పం ఘటనలోనే 60 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారని.. కేసులు, జైళ్లకు భయపడమన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పంలో ఏం పని? అని లోకేశ్‌ ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించవద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని.. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ చేతకానితనం వల్లే వైసీపీ కుక్కలు రెచ్చిపోయాయని.. సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. 


‘‘పేదల కడుపునింపే అన్నా క్యాంటీన్‌ను అడ్డుకున్నారు. మీరు మనుషులా.. పశువులా?. ఇంకెన్ని కుక్కలను పంపుతారో పంపుకోండి. మేం భయపడం.. యుద్ధానికి సిద్ధం. వైసీపీ ప్రభుత్వ తప్పులను అరికడతాం. ప్రజలతోనే మా పొత్తు ఉంటుంది.’’ అని నారా లోకేశ్ తెలిపారుు. 








Updated Date - 2022-08-31T00:08:50+05:30 IST