విశాఖలో రౌడీ దిగాడు: లోకేష్

ABN , First Publish Date - 2021-03-04T22:19:13+05:30 IST

ఒక్క ఛాన్స్ అడిగి సీఎం జగన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలో రౌడీ దిగాడు: లోకేష్

విశాఖ: ఒక్క ఛాన్స్ అడిగి సీఎం జగన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విద్యార్థులతో లోకేష్ సమావేశమయ్యారు.ఈసందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నానికి రెండేళ్లు ఏం చేశారో చెప్పాలని  వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం రాజధాని అన్నారు.. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.విశాఖలో రౌడీ దిగాడు.. A2 మొత్తం భూములు దోచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. విశాఖకు ఐటీ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం కన్నా ఉన్న పరిశ్రమలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చాలా బాధగా ఉందన్నారు. రాష్ట్రం దారితప్పుతుంది.. మీ ఓటు విశాఖ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్పారు.టీడీపీ అధికారంలో ఉండగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కావాలన్నామని.. కానీ దాన్ని  వైసీపీ ప్రభుత్వం వెల్లగొట్టిందని ధ్వజమెత్తారు.


రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రయత్నించాలన్నారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ ద్వారా రెండేళ్లు ఒక్క ఉద్యోగం ఇచ్చారా? అని జగన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైఖరీ ఇలాగే కొనసాగితే వడ్డీ కట్టలేని పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచారు. ఇప్పుడు నష్టాలు వచ్చాయి అని చెబుతున్నారన్నారు. పక్కనే ఉన్న జింక్ మూసేసారు ఇప్పుడు కార్మికులు రోడ్డున్న పడ్డారని మండిపడ్డారు. విశాఖలో ఆధాని డేటా సెంటర్ వచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ రావడానికి భయపడుతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-04T22:19:13+05:30 IST