Nara lokesh: జగన్ ప్రకటించిన 4వ నేర రాజధాని నెల్లూరు

ABN , First Publish Date - 2022-09-08T01:29:53+05:30 IST

రాష్ట్రానికే నేర రాజధానిగా నెల్లూరుని తయారు చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ నేతల వేధింపులతో ముసునూరులో దళిత యువకుడు..

Nara lokesh: జగన్ ప్రకటించిన 4వ నేర రాజధాని నెల్లూరు

కావలి (Kavali): రాష్ట్రానికే నేర రాజధానిగా నెల్లూరుని తయారు చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh)  అన్నారు.  వైసీపీ నేతల వేధింపులతో ముసునూరులో దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ (Duggirala Karunkar) ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డిని  ప్రశ్నిస్తున్న ఎస్సీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ఎందరో పేదల్ని చంపేసిన రాజారెడ్డి (Rajareddy) రాజ్యాంగాన్ని ఏపీ (Ap)లో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ (Cm jagan) పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని వ్యాఖ్యానించారు.  దళితులను చంపి, హింసించినా ఏ ఒక్క కేసులోనూ వైసీపీ నేతలకు శిక్ష పడలేదని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 


‘‘దళితుల్ని చంపేవారికి వైసీపీ (Ycp)లో ఉన్నత పదవులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 4వ నేర రాజధాని నెల్లూరు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు‌లో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయింది. కరుణాకర్ తన ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి చేపల చెరువుకు రూ.20లక్షలు పెట్టుబడి పెట్టారు.  కరుణాకర్ మృతికి షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డే కారణం. మంత్రి కాకాణి నెల్లూరులో అడ్డగోలుగా ప్రాణాలు తీస్తూ వారి కుటుంబాలకు రేటు ఫిక్స్ చేస్తున్నారు. వైసీపీ దూరాగతాల కారణంగా చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లా నేతలు మినీ మహానాడు తర్వాత పాదయాత్ర చేస్తారు.’’ అని లోకేష్ తెలిపారు. 




Updated Date - 2022-09-08T01:29:53+05:30 IST