
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన ప్రభుత్వం ఇటీవల కాలంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. వైసీపీ పాలకులను తరిమితరిమికొట్టడం కూడా ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో నాలుగు వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు, 55 మంది సీనియర్ నాయకులను వేధించడంతో పాటు పలు రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారని లోకేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి