AP News: నారా లోకేష్ ప్రెస్మీట్ను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-08-21T20:01:47+05:30 IST

టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రెస్మీట్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో లోకేష్, టీడీపీ (TDP) శ్రేణుల వాగ్వాదానికి దిగాయి.

AP News: నారా లోకేష్ ప్రెస్మీట్ను అడ్డుకున్న పోలీసులు

విశాఖ: టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రెస్మీట్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో లోకేష్, టీడీపీ (TDP) శ్రేణుల వాగ్వాదానికి దిగాయి. ప్రెస్మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత తమపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు. సమస్యలపై ప్రభుత్వాన్ని తాము నిలదీస్తే.. అడుగడుగునా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం జేసీబీలకే పని దొరుకుతోందని, టీడీపీ నేతల ఆస్తులను జేసీబీలతో కూల్చడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దేవాలయం ప్రహరీలను కూడా జేసీబీలతో కూల్చివేసే పరిస్థితికి వచ్చారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, అన్నిరకాల పన్నులతో పాటు చెత్త పన్నును కూడా వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి అప్పలరాజు (Minister Appalaraju) చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పాలి? అని ప్రశ్నించారు. ‘‘నేనేమన్నా టెర్రరిస్టునా?.. ఎందుకంత భయపడుతున్నారు?.. జిల్లాలో నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.


Updated Date - 2022-08-21T20:01:47+05:30 IST