
Amaravathi: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి (Ayyanna patrudu)పై వైసీపీ (YCP) ప్రభుత్వం చేసిన ఘటనపై టీడీపీ (TDP) జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పులి భయపడిందని అన్నారు. నోటీసులిస్తామంటూ పోలీసులు అరెస్టు డ్రామా.. దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే గట్టగానే భయపడినట్లు కనిపిస్తోందని అన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనజాతర.. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి జడుసుకుని పిరికిపందచర్యలు మొదలుపెట్టారని అన్నారు. మూడేళ్ల తర్వాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టు చేయడంలాంటి చర్యలకు పాల్పడుతున్న జగన్రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తోందన్నారు. గతంలో వైసీపీ నేతల తిట్ల దండకాలను ప్రస్తావిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి