
అమరావతి: సీఎం జగన్ రచ్చ గెలిచినా ఇంట గెలవలేడని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేతకాని తనం వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ నడుపుతున్నప్పుడు.. వైఎస్ షర్మిల ఇక్కడ పార్టీ పెడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. షర్మిల కొత్త పార్టీ పెట్టినప్పుడు సీపీఐ వైఖరీ తెలియజేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్‌ఈసీకే అనుకూలంగా వస్తుందని నారాయణ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వం చేతకాని తనమే అవుతుందని ఎద్దేవా చేశారు.ఉద్యోగులు సహా ఎవరూ రాజ్యాంగానికి అతీతం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అసమర్థుడని నారాయణ ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి :
జగన్ పైకి షర్మిల బాణం!