
అమరావతి: మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్, రామకృష్ణ సంస్థలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్మెంట్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోసం గత వారం నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వచ్చే నెల 9 వరకు మాజీమంత్రి నారాయణ, లింగమనేని, రామకృష్ణ సంస్థలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి