నారాయణపేటలో చెట్టును ఢీకొన్న కారు, మహిళ మృతి

ABN , First Publish Date - 2021-02-28T18:11:14+05:30 IST

దామరిగిద్ద మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‎ను తప్పించబోయిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి...

నారాయణపేటలో చెట్టును ఢీకొన్న కారు, మహిళ మృతి

నారాయణపేట: దామరిగిద్ద మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‎ను తప్పించబోయిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన విఠలాపూర్ గ్రామ స్టేజి దగ్గర చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-28T18:11:14+05:30 IST