నారాయణపేటకు టీఎస్‌ 38 అనే ప్రత్యేక గుర్తింపు

Sep 17 2021 @ 23:35PM
ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు

- పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 

నారాయణపేటటౌన్‌, సెప్టెంబరు 17: నారా యణపేట జిల్లాలో రవాణ శాఖ కార్యాల యం ప్రారంభం కావడంతో జిల్లాకు టీఎస్‌ 38 అనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడ లు యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలో నూతన రవాణా శాఖ కార్యాలయాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజమ్మ, ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచం దన తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తరువాత నారాయణపేట జిల్లాగా ఏర్పడి ఎంతో అభివృద్ధి సాధించందన్నారు. త్వరలోనే సొంత కార్యాలయాన్ని నిర్మించి అక్కడికి బదిలీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మాట్లాడు తూ జిల్లాలో రవాణ శాఖ కార్యాలయం లేనప్పుడు  60కి.మీ. దూరం వెళ్లి వాహనం రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందులు తప్పయన్నారు.  ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి మా ట్లాడుతూ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని జి ల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సీఎం కేసీఆర్‌ తీసుకెళ్తారన్నారు. కార్యక్రమంలో ఎస్పీ చేతన, పుర చైర్‌పర్సన్‌ అనసూయ, వైస్‌ చైర్మ న్‌ హరినారాయణ భట్టడ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రామకృష్ణ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిష నర్‌ దుర్గా ప్రమీల, రవాణశాఖ అధికారి  వీర స్వామి, ప్రజా ప్రతినిధులు, అధికారులు  పాల్గొన్నా రు.

వ్యాక్సినేషన్‌  కార్యక్రమాన్ని పరిశీలించిన  మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పా టు చేసిన ప్రత్యేక క్యాంప్‌ను అధికా రులు, ప్రజా ప్రతినిధులు సమన్వ యంతో పని చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు యువజన సర్వీ సులు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం పేటలో జరు గుతున్న వ్యాక్సి నేషన్‌ కార్యక్ర మాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తీ సుకోవాలని పిలుపుని చ్చారు. మంత్రి వెంట జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ మ్మ, కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన, ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, చిట్టెం రామ్మో హన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Follow Us on: