ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి మోదీ ఫోన్‌

ABN , First Publish Date - 2022-10-05T09:50:20+05:30 IST

: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణు బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి మోదీ ఫోన్‌

ఆ దేశంలోని అణు విద్యుత్కేంద్రాల భద్రతపై ఆందోళన

చర్చలతో యుద్ధవిరమణకు కృషి చేయాలని సూచన


న్యూఢిల్లీ, అక్టోబరు 4: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణు బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ దేశంలోని అణు విద్యుత్‌ కేంద్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు సైనిక పరిష్కారం ఉండదని అభిప్రాయపడ్డ మోదీ.. చర్చలు, దౌత్యం ద్వారా వీలైనంత త్వరగా యుద్ధవిరమణకు కృషి చేయాలని సూచించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఏ సాయం కావాలన్నా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీకి మోదీ తెలిపినట్టు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజారోగ్యంపైన, పర్యావరణంపైన దాని ప్రభావం దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు వెల్లడించింది. 

Updated Date - 2022-10-05T09:50:20+05:30 IST