Viral Video: ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో.. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి ఎస్కేప్.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-08-09T00:50:49+05:30 IST

ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఓ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. అతడు దాటిని వెంటనే ఫుట్‌పాత్ కూలిపోయింది.

Viral Video: ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో.. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి ఎస్కేప్.. వీడియో వైరల్!

ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఓ వ్యక్తి తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడు దాటిన వెంటనే ఫుట్‌పాత్ కూలిపోయింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ (viral video) అయింది. ఆ వీడియో ప్రకారం..  ఒక వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న దుకాణంలోకి వెళ్లేందుకు ఫుట్‌పాత్‌ (footpath) మీద నుంచి నడిచాడు. అతడు ఫుట్‌పాత్ దాటి షాపు మెట్లపై కాలు పెట్టగానే ఆ ఫుట్‌పాత్‌ కుంగిపోయింది. 


దాని కింద చాలా లోతైన డ్రైనేజ్‌ ఉంది. ఫుట్‌పాత్ కుంగిపోయిన షాక్ నుంచి ఆ వ్యక్తి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతను చాలా లక్కీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతను దేశంలోనే బలమైన వ్యక్తి అని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. ఆ ఫుట్‌పాత్‌ అతడి వల్లే కుంగిందని, దానికి ఆయనే డబ్బులు చెల్లించాలని మరొకరు కామెంట్ చేశారు.

Updated Date - 2022-08-09T00:50:49+05:30 IST