నర్సరీ లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోవాలి

Jun 24 2021 @ 00:14AM
నోటీసు అందజేస్తున్న హన్మంత్‌నాయక్‌

బల్లికురవ, జూన్‌ 23 : నర్సరీల నిర్వాహకులు లైసెన్సుల ను రెన్యువల్‌ చేసుకోకుంటే చర్యలు తప్పవని మార్టూరు ఉద్యానశాఖాధికారి హన్మంత్‌ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని వేమవ రం, ఉప్పుమాగులూరు గ్రామాల్లో నర్సరీల నిర్వాహకులు ఆ యన నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం బల్లికురవలో గ్రామ వ్యవసాయ సహాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కార్యాచరణపై చర్చించారు.  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.