నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్ కేసు ఎన్ఐఏకు అప్పగింత

ABN , First Publish Date - 2022-06-23T15:22:10+05:30 IST

నర్సింగ్ విద్యార్థిని రాధ కిడ్నాప్ కేస్(kidnap case) జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగించారు.

నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్ కేసు ఎన్ఐఏకు అప్పగింత

హైదరాబాద్ : నర్సింగ్ విద్యార్థిని రాధ కిడ్నాప్ కేస్(kidnap case) జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగించారు. వైజాగ్‌(Vizag)లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. మూడున్నర సంవత్సరాల క్రితం తమ కూతురు రాధని కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్ట్ అనుభంద సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తన కూతురును బలవంతంగా మావోయిస్ట్ పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో రాధ తల్లి వెల్లడించింది. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర స్వప్న శిల్ప తదితరులు తమ నివాసానికి వచ్చేవారని వెల్లడించింది. 2017లో వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురుని తీసుకెళ్లారని.. అప్పటి నుంచి ఇంటికి రాధ తిరిగి రాలేదని ఫిర్యాదులో తెలిపింది. 2018 నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరి ఉదయ్ అరుణతో కలిసి ఏవోబీలో రాధ పని చేస్తోందని తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్ర నేతలు గాజర్ల రవి, దేవేంద్ర, శిల్ప, స్వప్న పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఎన్ఐఏ చేర్చింది.

Updated Date - 2022-06-23T15:22:10+05:30 IST