విశాఖ: నర్సీపట్నం 26వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. రేషన్ పంపిణీ వాహనంలో వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారు. స్థానిక రేషన్ డిపోకు సంబంధించిన వెహికల్ కాదని, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిందితులు అధికార పార్టీకి సంబంధించిని వారు కాబట్టి కేసులు నమోదు చేయడంలేదని అంటున్నారు. పట్టుబడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.