నడీరోడ్డుపై మేయర్ చేసిన పని నెట్టింట వైరల్.. బొమ్మ తుపాకీ పట్టుకుని..

ABN , First Publish Date - 2022-01-01T21:30:54+05:30 IST

ప్రస్తుతం ఓ మేయర్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. మేయర్ చేసిన పనికి కొందరు మద్దతు పలుకుతుంటే.. మరికొందరేమో.. కన్నెర్రజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజలకు బుద్ధి చెప్పాల్సిందిపోయి మీరే ఇలా చేయడం

నడీరోడ్డుపై మేయర్ చేసిన పని నెట్టింట వైరల్.. బొమ్మ తుపాకీ పట్టుకుని..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ మేయర్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. మేయర్ చేసిన పనికి కొందరు మద్దతు పలుకుతుంటే.. మరికొందరేమో.. కన్నెర్రజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజలకు బుద్ధి చెప్పాల్సిందిపోయి మీరే ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ విమర్శిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ మేయర్ ఎవరు? ఆయన చేసిన పని ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఫిలిప్పీన్స్‌లోని నార్వాకాన్ నగరానికి చెందిన మేయర్.. లూయిస్ "చావిట్" సింగ్సన్.. క్రిస్మస్ సందర్భంగా నడీ రోడ్డుపై ఓ పని చేశాడు. గోల్డ్ కలర్‌లో ఉన్న బొమ్మ తుపాకీలో కొన్ని కరెన్సీ నోట్లను పెట్టి.. వాటిని అక్కడ ఉన్న ప్రజల మధ్యకు వెదజల్లాడు. దీంతో వాటిని ఏరుకోవడానికి అక్కడున్నవారంతా ఎగబడ్డారు. అంతేకాకుండా ప్రజల సంతోషంగా ఉండటం కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. దీంతో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ప్రజలకు మేయర్ డబ్బులు పంచడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఒమైక్రాన్ ముంచుకొస్తుంటే.. కనీసం మాస్కులు కూడా ధరించకుండా ఇలా చేయడం సరికాదని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను పాటించాలని ప్రజలకు చెప్పాల్సింది పోయి.. వాటిని మీరే గాలికొదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. 




Updated Date - 2022-01-01T21:30:54+05:30 IST