నాసాలోకి 10మంది కొత్త వ్యోమగాములు

ABN , First Publish Date - 2021-12-08T07:33:02+05:30 IST

చంద్రుడు, అంగారకుడిపైకి తమ భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసం 10మంది కొత్త వ్యోమగాముల్ని నాసా సోమవారం ఎంపిక చేసింది...

నాసాలోకి 10మంది కొత్త వ్యోమగాములు

 ఎంపికైన వారిలో భారత సంతతి వ్యక్తి అనిల్‌ మీనన్‌

కేప్‌ కనవెరల్‌, డిసెంబరు 7: చంద్రుడు, అంగారకుడిపైకి తమ భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసం 10మంది కొత్త వ్యోమగాముల్ని నాసా సోమవారం ఎంపిక చేసింది. మొత్తం ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలను హూస్టన్‌లో నాసా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ పది పోస్టుల కోసం ప్రపంచవ్యాప్తంగా 12వేల మందికి పైగా దరఖాస్తులను పంపించారు. ఎంపికైన పదిమందికి రెండేళ్లు నాసా శిక్షణను అంది స్తుంది. ఎంపికైనవారిలో భారత సంతతికి చెందిన అనిల్‌ మీనన్‌(45) కూడా ఉన్నారు. ఆయన అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేశారు. స్పేస్‌ ఎక్స్‌ తొలి ప్రయోగంలో సిబ్బందికి వైద్యసదుపాయాన్ని అందించారు. 

Updated Date - 2021-12-08T07:33:02+05:30 IST