ఐపీఎల్‌ నుంచి నటరాజన్‌ అవుట్‌!

ABN , First Publish Date - 2021-04-23T06:28:00+05:30 IST

ఈ ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో దెబ్బ తగిలింది. జట్టు లెఫ్టామ్‌ పేసర్‌ నటరాజన్‌ మోకాలి గాయం కారణంగా పూర్తిగా లీగ్‌ నుంచే వైదొలిగాడు

ఐపీఎల్‌ నుంచి నటరాజన్‌ అవుట్‌!

ముంబై: ఈ ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో దెబ్బ తగిలింది. జట్టు లెఫ్టామ్‌ పేసర్‌ నటరాజన్‌ మోకాలి గాయం కారణంగా పూర్తిగా లీగ్‌ నుంచే వైదొలిగాడు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ నటరాజన్‌కు గాయం తిరగబెట్టడంతో అతను ఐపీఎల్‌కు దూరమైనట్టు సన్‌రైజర్స్‌ వర్గాలు తెలిపాయి. ఈ లీగ్‌లో నటరాజన్‌ రెండే మ్యాచ్‌లాడాడు. 

Updated Date - 2021-04-23T06:28:00+05:30 IST