మార్కెట్లోకి నాట్కో సీటీపీఆర్‌ క్రిమిసంహారిణి

ABN , First Publish Date - 2022-09-25T07:17:23+05:30 IST

క్రిమిసంహారిణి కోరంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌)ను నాట్కో ఫార్మా మార్కెట్లోకి విడుదల చేసింది.

మార్కెట్లోకి నాట్కో సీటీపీఆర్‌ క్రిమిసంహారిణి

నాట్‌జెన్‌ బ్రాండ్‌తో విక్రయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్రిమిసంహారిణి కోరంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌)ను నాట్కో ఫార్మా మార్కెట్లోకి విడుదల చేసింది. ‘నాట్‌జెన్‌’ బ్రాండ్‌తో ఫార్ములేషన్‌ ఉత్పత్తిని ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. సీటీపీఆర్‌ కలిగిన క్రిమిసంహారకాల మార్కెట్‌ విలువ భారత్‌లో రూ.2,000 కోట్ల మేరకు ఉన్నట్లు అంచనా. క్లోరంట్రానిలిప్రోల్‌ ఫార్ములేషన్లను విడుదల చేయడానికి నాట్కోకు ఇటీవల  ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాన్‌-ఇన్‌ఫ్రింజింగ్‌ ప్రాసెస్‌ ద్వారా వీటిని విడుదల చేయాలని ఆదేశించింది. 


సీటీపీఆర్‌ను దేశీయంగా తయారు చేయడానికి సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్‌ బోర్డు అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిటీ నుంచి అనుమతి పొందిన తొలి కంపెనీ నాట్కోనే. వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా వ్యవసాయ సస్యరక్షణ ఉత్పత్తుల మార్కెట్లోకి కంపెనీ అడుగు పెట్టిందని నాట్కో సీఈఓ రాజీవ్‌ నన్నపనేని వెల్లడించారు.

Updated Date - 2022-09-25T07:17:23+05:30 IST