నల్ల చట్టాలను వెనక్కి తీసుకోండి

ABN , First Publish Date - 2020-11-27T05:43:16+05:30 IST

కార్మికులు, రైతుల మనుగడను ప్రశ్నార్థం చేసే చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు డిమాండ్‌ చేశారు.

నల్ల చట్టాలను వెనక్కి తీసుకోండి
చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో కార్మికుల మానవహారం

సార్వత్రిక సమ్మెలో వామపక్షాలు


చోడవరం, నవంబరు 26: కార్మికులు, రైతుల మనుగడను ప్రశ్నార్థం చేసే చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు డిమాండ్‌ చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్షాల నాయకులు, కార్మికులు పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొత్తూరు జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎన్‌.భాస్కరరావు, ఆర్‌.అప్పలరాజు పాల్గొన్నారు. 


బుచ్చెయ్యపేటలో...


బుచ్చెయ్యపేట: సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వడ్డాదిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రతను కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు గునూరు వరలక్ష్మి, జి.వెంకటరమణ, మొల్లి శ్రీను, పి.సాంబశివరావు, చినబ్బాయి పాల్గొన్నారు.


రావికమతంలో...

రావికమతం: మండలంలోని ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, భోజన నిర్వాహకులు సమ్మెలో పాల్గొన్నారు. నాలుగురోడ్ల కూడలి వద్ద రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీపీఏం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.


రోలుగుంటలో...

రోలుగుంట: సమ్మెకు మద్దతుగా వివిధ రంగాల కార్మికులు ర్యాలీ చేశారు. రైతుల వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటీకరణను ఆపాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T05:43:16+05:30 IST