నిజాంసాగర్‌ డ్యాంపై జాతీయ గీతాలాపన

ABN , First Publish Date - 2022-08-17T05:27:41+05:30 IST

స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభ నిజాంసాగర్‌ డ్యాంపై 11.30 గంటలకు జాతీయ గీతాలాపన చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు నవోదయ, కస్తూర్బా, మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయ బృందాలు నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

నిజాంసాగర్‌ డ్యాంపై జాతీయ గీతాలాపన
డ్యాంపై ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభ

నిజాంసాగర్‌, ఆగస్టు 16: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభ నిజాంసాగర్‌ డ్యాంపై 11.30 గంటలకు జాతీయ గీతాలాపన చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు నవోదయ, కస్తూర్బా, మోడల్‌ స్కూల్‌ విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయ బృందాలు నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వీఏఆర్‌ నెంబర్‌ 5 గేట్లపై మువ్వన్నెల జెండాను పట్టుకుని ప్రజా ప్రతినిధులు డ్యాం వరకు ర్యాలీగా వెళ్లారు. గోల్‌బంగ్లాపై మువ్వన్నెల జెండాను జడ్పీ చైర్‌పర్సన్‌ శోభ, ఎంపీపీ జ్యోతి ఆవిష్కరించారు. గేట్లపై నిజాంసాగర్‌ పోలీసులు జెండాలను పట్టుకుని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నామని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయ్యాక ఎన్నో సంక్షేమ ఫలాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మండలంలోని అధికారులు, అనధికారులు హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుపై దళితబంధు కింద మల్లూర్‌ గ్రామానికి చెందిన పుష్పలతకు కారును జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, ఎంపీపీ జ్యోతి  అందజేశారు. ప్రభుత్వం నూతనంగా కొత్తగా మంజూరు చేసిన పింఛన్లను అచ్చంపేటకు చెందిన బేగరి రాజుకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు గైని విఠల్‌, మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి, విండో చైర్మన్‌ నర్సింహారెడ్డి, సర్పంచ్‌ అనసూయ, ఎంపీటీసీలు సుజాత రమేష్‌, దేవదాస్‌, తహసీల్దార్‌ నారాయణ, ఎస్సై రాజు, నాయకులు వై.నారాయణ తదితరులున్నారు.

Updated Date - 2022-08-17T05:27:41+05:30 IST