తిరుపతి సైబర్‌ వింగ్‌కు జాతీయ అవార్డులు

Published: Tue, 18 Jan 2022 03:55:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరుపతి సైబర్‌ వింగ్‌కు జాతీయ అవార్డులు

  • బెస్ట్‌ టీమ్‌ మెంటార్‌గా ఎస్పీ వెంకట అప్పల నాయుడు
  • ఉత్తమ ఇన్వెస్టిగేటర్‌గా సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి


తిరుపతి(నేరవిభాగం), జనవరి 17: తిరుపతి అర్బన్‌జిల్లా పోలీస్‌ సైబర్‌ వింగ్‌కు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ఎస్పీ వెంకట అప్పల నాయుడికి బెస్ట్‌ సైబర్‌ టీమ్‌ మెంటార్‌, సైబర్‌ వింగ్‌ సీఐ వి.సుబ్రహ్మణ్యంరెడ్డికి బెస్ట్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేటర్‌ అవార్డు లభించాయి. నేషనల్‌ సైబర్‌ అవార్డ్స్‌-2021 కోసం బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ మీట్‌-3.0 పోటీలు గత నెలలో వర్చువల్‌గా జరిగాయి. దేశవ్యాప్తంగా 784 జిల్లాల పోలీసు సైబర్‌ విభాగాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సంవత్సర కాలంగా ఆయా జిల్లాల సైబర్‌ పోలీస్‌ విభాగాలు చేపట్టిన కేసులు, దర్యాప్తు, పరిష్కరించిన విధానాల గురించి నివేదికలు సమర్పించాయి. పరిశీలించిన జాతీయ కమిటీ ఉత్తమ దర్యాప్తు సైబర్‌ పోలీసు విభాగాలకు అవార్డులు ప్రకటించింది.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.