
రాజమండ్రి: రాజమహేంద్రవరంలో ఈనెల 26, 27 తేదీల్లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతి మహోత్సవ కార్యక్రమం జరుగనుంది. దీనికి సంబంధించి రాజమండ్రి పుష్కరఘాట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కళాకారులు శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా సాంస్కతిక నగరం రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 37 బృందాలు ఈ ఉత్సవ్‌లో పాల్గొంటున్నాయి.
ఇవి కూడా చదవండి