ఎన్‌డీఏకు ఇలా సిద్ధం కండి..!

ABN , First Publish Date - 2021-07-28T17:40:20+05:30 IST

ఇంటర్‌ తరవాత సైన్యంలో చేరేందుకు అవకాశం కల్పించే పరీక్ష ఎన్‌డిఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ ఎగ్జామినేషన్‌). యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏటా రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది

ఎన్‌డీఏకు ఇలా సిద్ధం కండి..!

ఇంటర్‌ తరవాత సైన్యంలో చేరేందుకు అవకాశం కల్పించే పరీక్ష ఎన్‌డిఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ ఎగ్జామినేషన్‌). యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏటా రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన వారికి డిగ్రీకి తోడు త్రివిధ దళాల్లో అధికారిగా కెరీర్‌ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా సెప్టెంబరులో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ పద్ధతి గురించి తెలుసుకుందాం...!


నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డిఏ)ని మహారాష్ట్ర పుణెలోని ఖడక్‌వాస్లాలో 1954లో ఏర్పాటు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందే కేడెట్లకు ఈ అకాడమీ ముందస్తు శిక్షణనిస్తుంది. త్రివిధ దళాలకు చీఫ్‌గా పని చేసిన వారెందరో తమ కెరీర్‌ను ఎన్‌డిఏ నుంచే ప్రారంభించారు.  


రాత పరీక్షలో రెండు పేపర్లు:

రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లకు కలిపి కేటాయించిన మొత్తం మార్కులు 900. 

పేపర్‌ - 1: ఇందులో మేథమెటిక్స్‌ నుంచి 120 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 150 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. కేటాయించిన మార్కులు 300. అంటే ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మాత్రికలు, అనలిటికల్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలికులస్‌, ఇంటెగ్రల్‌ కాలికులస్‌, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, వెక్టర్‌ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్‌, ప్రాబబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

పేపర్‌ - 2: ఇది జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌. ఇందులోని 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. కేటాయించిన మార్కులు 600. అంటే ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ను రెండు విభాగాలుగా విభజించారు. మొదటి విభాగంలో ఇంగ్లీష్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 200. ఇందులో గ్రామర్‌, ఒకాబులరీ, కాంప్రహెన్షన్‌, యూజ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండో విభాగంలో జనరల్‌ నాలెడ్జ్‌ ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. వీటికి కేటాయించిన మార్కులు 400. ఇందులో సెక్షన్‌-ఎ ఫిజిక్స్‌, సెక్షన్‌-బి కెమిస్ర్టీ, సెక్షన్‌-సి జనరల్‌ సైన్స్‌, సెక్షన్‌-డి హిస్టరీ, భారత స్వాతంత్రోద్యమం, సెక్షన్‌-ఇ జాగ్రఫీ, సెక్షన్‌-ఎ్‌ఫ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తంగా చూస్తే ప్రశ్నలలో సెక్షన్ల వారీగా ఎ-25 శాతం (100 మార్కులు), బి-15 శాతం (60 మార్కులు), సి-10 శాతం (40 మార్కులు), డి-20 శాతం (80 మార్కు లు), ఇ-20 శాతం (80 మార్కులు), ఎఫ్‌-10 శాతం (40 మార్కులు) వెయిటేజీని కలిగి ఉంటాయి. 

నెగిటివ్‌ మార్కింగ్‌: ప్రశ్నల క్లిష్టత విద్యార్థుల అర్హత పరీక్ష స్థాయిలోనే ఉంటుంది. వాటిని గుర్తించడం కూడా తేలికే. కాకపోతే కచ్చితమైన సమాధానాలను గుర్తించడం ముఖ్యం. ఎందుకంటే నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. సబ్జెక్ట్‌ను బట్టి కూడా నెగిటివ్‌ మార్కులు మారుతుంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి మేథమెటిక్స్‌లో 0.83, ఇంగ్లీ్‌షలో 1.33, జనరల్‌ ఎబిలిటీలో 1.33 మార్కు కోత విధిస్తారు.


ప్రిపరేషన్‌ ఇలా..

మేథమెటిక్స్‌ కోసం 6-10వ తరగతి మేథ్స్‌ పుస్తకాల్లోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకోవాలి. అందులోని సూత్రాలను, ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంత ఎక్కువగా మోడల్‌ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. ఇదే క్రమంలో షార్ట్‌కట్‌ మెథడ్స్‌నూ నేర్చుకోవాలి. తద్వారా సమాధానాన్ని వేగంగా, కచ్చితత్వంతో గుర్తించవచ్చు. 


జనరల్‌ ఎబిలిటీ విభాగం కోసం ప్రతి రోజూ తెలుగు, ఆంగ్ల దినపత్రికలను చదవాలి. అందులో ముఖ్యమైన వాటిని పాయింట్ల రూపంలో నోట్‌ చేసుకోవాలి. ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, జనరల్‌ సైన్స్‌, హిస్టరీ, భారత స్వాతంత్ర్యోద్యమం, జాగ్రఫీ కోసం ఆయా సబ్జెక్ట్‌ల వారీగా ఎన్‌సీఈఆర్‌టీ 11, 12వ తరగతి పుస్తకాలను చదవాలి. ఇంగ్లీ్‌షలో గ్రామర్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి. ముఖ్యంగా గ్రామర్‌ను వాక్య నిర్మాణంలో ఏవిధంగా అన్వయిస్తున్నారో అవగాహన పెంచుకోవాలి. రోజూ ఆంగ్ల దినపత్రిక చదవడం కూడా ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది. మోడల్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. అంతేకాకుండా సబ్జెక్ట్‌ల వారీగా వచ్చే అవకాశం ఉన్న బిట్లను ముందే ఊహించుకొని ప్రాక్టీస్‌ చేయడం ఉత్తమం.

Updated Date - 2021-07-28T17:40:20+05:30 IST