National flag: నగరంలో జోరుగా జాతీయ జెండాల విక్రయం

ABN , First Publish Date - 2022-08-09T15:56:07+05:30 IST

చెన్నై నగర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో జాతీయ జెండా(National flag)ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను

National flag: నగరంలో జోరుగా జాతీయ జెండాల విక్రయం

అడయార్‌(చెన్నై), ఆగస్టు 8: చెన్నై నగర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో జాతీయ జెండా(National flag)ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి  ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల పేరుతో ఈ 75వ స్వాంతత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇల్లు, కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. పైగా జాతీయ జెండా ఎగిరే సమయా ల్లో కూడా మార్పులు చేశారు. దీంతో నగరంలో జాతీయ జెండాల విక్రయం జోరుగా సాగుతోంది.

Updated Date - 2022-08-09T15:56:07+05:30 IST