చేనేతకు సాంకేతికత అవసరం

ABN , First Publish Date - 2022-08-08T05:12:55+05:30 IST

చేనేత కార్మికులు మారుతున్న కాలాను గుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ కన్వీనర్‌ కలవకొలను తులసి అన్నారు.

చేనేతకు సాంకేతికత అవసరం
నరసాపురంలో చేనేత కార్మికులను సత్కరిస్తున్న తులసి

ఘనంగా చేనేత దినోత్సవం


నరసాపురం రూరల్‌, ఆగస్టు 7: చేనేత కార్మికులు మారుతున్న కాలాను గుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ కన్వీనర్‌ కలవకొలను తులసి అన్నారు. రుస్తుంబాదా లేస్‌ సెంటర్‌లో ఆది వారం జాతీయ చేనేత కార్మిక దినోత్సావం నిర్వహించారు. పలువురు చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. లేస్‌ పరిశ్రమతో పాటు చేనేత పరిశ్ర మకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. కొత్త డిజైన్లు నేర్చుకుని ఎగ్జిబిషన్‌ ద్వారా మార్కెట్‌లో విక్రయించుకోవాలన్నారు. దీనివల్ల అర్డర్లు పెరిగి చేనేత కార్మికులు అర్ధికాభివృద్ధి సాధించవచ్చున్నారు. కార్యక్రమంలో రాజేష్‌సింగ్‌, అడ్డగళ్ళ బాబా, చినమిల్లి దివాకర్‌, మావూరి సత్యనారాయణ, అలంక నాగేశ్వరరావు, సాయిబాబా, శ్రీరామూర్తి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.



చేనేతలను ఆర్థికంగా ఆదుకోవాలి


తణుకు: చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని చేనేత కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వావిలాల సరళాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నరేంద్ర సెంటర్‌ వద్ద ఆదివారం సీనియర్‌ చేనేత కార్మికులను సన్మానించారు. చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీ రద్దు చేయాలన్నా రు. అర్హులందరికి ఆరోగ్యకార్డులు, రుణాలు, మగ్గం వేసుకోవడానికి ఇళ్లు, షెడ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చేనేత నాయకులు వావి లాల వెంకట రమేష్‌, అందే నాగయ్య, విశ్వనాథం కృష్ణవేణి, ఆకురాతి శ్రీని వాసు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ లేకుండా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చేనేత కార్మికులందరికి అండగా ఉంటామన్నారు. ఆకుల కిరణ్‌ తదితరలు పాల్గొన్నారు.


ఆచంట వేమవరంలో చేనేత దినోత్సవం


ఆచంట: ఎ.వేమవరంలో చేనేత కార్మికులు జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘ప్రతీ ఇంటా ఎగరాలి జాతీయ జెండా’ నినాదంతో జాతీయ జెండాలతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.  పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఆచంటలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ చేనేతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను కుంగదీసి, చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంచి దారుణంగా దెబ్బతీశాయని విమర్శించారు. చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై జీఎస్‌టీనీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శలా పూర్ణ చంద్రజోషి, బూడిద సింహాచలం, విశ్వనాథుల సత్యనారాయణ, విశ్వనాథుల  ఏసురత్నం, వాసా రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

–––––––––––––––––––––––––––

Updated Date - 2022-08-08T05:12:55+05:30 IST