
New Delhi: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు (National Herald Money Laundering Case)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మళ్లీ సోమవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటివరకు రాహుల్‌ను అధికారులు 30 గంటలపాటు విచారించారు. కాగా కాంగ్రెస్ ఆందోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్ దగ్గర పోలీస్ భద్రత పెంచారు. అలాగే ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ ఆఫీస్‌లోకి పోలీసులు అనుమతించడంలేదు.
ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తిరిగి శుక్రవారం (17న) విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే శుక్రవారం రాలేనని, రెండు రోజుల తర్వాత (సోమవారం) వస్తానని రాహుల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సోనియా గాంధీ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఈడీకి తెలిపారు. రాహుల్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు తిరిగి సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి