Advertisement

ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టాలి

Oct 29 2020 @ 02:00AM

పెద్దకొడప్‌గల్‌, అక్టోబరు 28: జాతీయ రహదారి 161 పనుల్లో భాగంగా గ్రామాల రహదారులు, రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టాల ని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం మండలంలోని పోచారం గ్రామ రహదా రిని పరిశీలించి, రహదారిని పునరుద్ధరించాలని సూచించారు. అటవీశాఖ, నేష నల్‌ హైవే అధికారులు సమన్వయంతో పని చేయాలని, పోచారంతోపాటు రాక పోకలు సాగించే 12 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. రాకపోకలను పునరుద్ధరించే విధంగా రోడ్డును కలపాలని సం బంధిత అధికారులకు సూచించారు. అనంతరం బిచ్కుంద మండలంలో రహదా రిలో గృహాలు కోల్పోయిన బాధితులకు తక్కువ నష్టపరిహారం వచ్చిందని పలు వురు కలెక్టర్‌ దృష్టికి తీసుకుని వచ్చారు. కలెక్టర్‌ వెంట బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ్‌, డీఎఫ్‌వో సునీల్‌, నేషనల్‌ హైవే అధికారులు తదితరులున్నారు.


మద్నూర్‌: మద్నూర్‌ మండలంలో 161వ జాతీయ రహదారి నిర్మాణంలో లచ్చన్‌ గేటు వద్ద ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయం చేసి, స్థలం కే టాయించాలని శేఖాపూర్‌ సర్పంచ్‌ ఎంకే. పటేల్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు కలె క్టర్‌ శరత్‌ కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. బుధవారం ఆయన జాతీయ రహదారి 161కి సంబంధించి రోడ్డు పనులను పరిశీలించడానికి పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా బిచ్కుంద మండలం కందర్‌పల్లి గేటు వద్ద మద్నూర్‌ మండల రైతులు ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.