Manchryala: కొట్టుకుపోయిన National Highway..నిలిచిపోయిన రాకపోకలు

ABN , First Publish Date - 2022-09-12T14:00:02+05:30 IST

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులు నిండకుండలగా కళకళలాడుతున్నాయి. కాగా, కుండపోత వర్షానికి

Manchryala: కొట్టుకుపోయిన National Highway..నిలిచిపోయిన రాకపోకలు

Manchryala: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులు నిండకుండలగా కళకళలాడుతున్నాయి. కాగా, కుండపోత వర్షానికి పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం చింతలపల్లి సమీపంలో నేషనల్ హైవే(National Highway)కొట్టుకుపోయింది. అర్ధరాత్రి భారీ వర్షానికి బతుకమ్మ వాగు వంతెన దగ్గర అప్రోచ్‌ రోడ్డు(Approach Road) కొట్టుకుపోయింది. దీంతో తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌(Telangana-Maharashtra-Chhattisgarh) మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి.

Updated Date - 2022-09-12T14:00:02+05:30 IST