NIPER GUWAHATIలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2022-04-08T20:25:45+05:30 IST

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన గువహటిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైపర్‌) టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

NIPER GUWAHATIలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన గువహటిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైపర్‌) టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08

టీచింగ్‌ స్టాఫ్‌

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: మెడిసినల్‌ కెమిస్ట్రీ, మెడికల్‌ డివైసెస్‌, ఫార్మస్యూటికల్‌ టెక్నాలజీ అండ్‌ ఫార్ములేషన్స్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ. 78,800 నుంచి రూ.1,44,200 వరకు చెల్లిస్తారు.


నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌

పోస్టులు: ఎస్టేట్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, మెడికల్‌ ఆఫీసర్‌

విభాగాలు: అడ్మినిస్ట్రేషన్‌, కంప్యూటర్‌ సెక్షన్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. స్టేట్‌/ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి.

వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.44,900 నుంచి రూ.56,100 వరకు చెల్లిస్తారు

ఎంపిక: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: టీచింగ్‌ పోస్టులకు రూ.1000, నాన్‌టీచింగ్‌ పోస్టులకు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 11

వెబ్‌సైట్‌: niperguwahati.ac.in/

Updated Date - 2022-04-08T20:25:45+05:30 IST