NIT సూరత్కల్‌లో ఎంటెక్‌, పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-05-28T00:02:10+05:30 IST

సూరత్కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) - ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌/ రిసెర్చ్‌), పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌) ప్రోగ్రామ్‌లో 26 సీట్లు; ఎంటెక్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్‌లో 63 సీట్లు ఉన్నాయి. పీహెచ్‌డీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి...

NIT సూరత్కల్‌లో ఎంటెక్‌, పీహెచ్‌డీ

సూరత్కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్‌) - ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌/ రిసెర్చ్‌), పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌) ప్రోగ్రామ్‌లో 26 సీట్లు; ఎంటెక్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్‌లో 63 సీట్లు ఉన్నాయి. పీహెచ్‌డీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి. 


ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌/ రిసెర్చ్‌)

ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.

విభాగాలు - స్పెషలైజేషన్‌లు: సివిల్‌ (స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌, జియోటెక్నికల్‌ ఇంజనీరింగ్‌, ఎన్విరా న్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌); వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఓషన్‌ ఇంజనీరింగ్‌(మెరైన్‌ స్ట్రక్చర్స్‌, వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, జియోఇన్ఫర్మాటిక్స్‌); మెకానికల్‌ (థర్మల్‌ ఇంజనీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌, మెకట్రానిక్స్‌, మెకానికల్‌ డిజైన్‌); ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ నెట్‌వర్క్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌); కెమికల్‌ (కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీ); మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌(ప్రాసెస్‌ మెటలర్జీ, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, నానోటెక్నాలజీ); ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ (పవర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌); ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ; కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌(కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజ నీరింగ్‌, సీఎస్‌ఈ - ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ); మేథమెటికల్‌ అండ్‌ కంప్యూటేషనల్‌ సైన్సెస్‌ (కంప్యూటేషనల్‌ అండ్‌ డేటా సైన్స్‌); మైనింగ్‌ ఇంజ నీరింగ్‌(రాక్‌ ఎక్స్‌కవేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) 


అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీ ర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం లభిస్తుంది. స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 


పీహెచ్‌డీ: విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేథమెటికల్‌ అండ్‌ కంప్యూటేషనల్‌ సైన్సెస్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, మైనింగ్‌, ఫిజిక్స్‌, మేనేజ్‌మెంట్‌, వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఓషన్‌ ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఎంఏ/ సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. నెట్‌/ గేట్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫెలోషిప్‌ అందిస్తారు. 

ఎంపిక; ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో కేటగిరీలను అనుసరించి అకడమిక్‌ ప్రతిభ, గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌, అనుభవం, రిటెన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25

దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు చివరి తేదీ: మే 27

సెలెక్షన్‌ టెస్ట్‌/ రిటెన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల తేదీలు: జూన్‌ 16, 17

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: జూన్‌ 24

వెబ్‌సైట్‌: www.nitk.ac.in

Updated Date - 2022-05-28T00:02:10+05:30 IST