చల్లూరు పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు

ABN , First Publish Date - 2022-06-25T05:58:27+05:30 IST

మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి ‘ఎన్‌క్యూఏఎస్‌’ గుర్తింపు వచ్చినట్లు వైద్యాధికారి శ్రావన్‌ శుక్రవారం తెలిపారు.

చల్లూరు పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు
వీణవంక మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

 - వైద్య సేవలు, పరిశుభ్రతపై ‘ఎన్‌క్యూఏఎస్‌’ సర్టిఫికెట్‌

వీణవంక, జూన్‌ 24: మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి ‘ఎన్‌క్యూఏఎస్‌’ గుర్తింపు వచ్చినట్లు వైద్యాధికారి శ్రావన్‌ శుక్రవారం తెలిపారు. దేశ వ్యాప్తంగా పలు విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు, పరిసరాల పరిశుభ్రత రోగులకు నాణ్యమైన ఓపీ సేవలు వంటి విభాగాలపై జాతీయ హెల్త్‌ విభాగం చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంపిక కాగా చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 81.89 శాతం మార్కులు వచ్చినట్లు తెలిపారు. ఆరు విభాగాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందిస్తున్న సేవలపై సర్వే నిర్వహించి ఎంపిక చేసినట్లు తెలిపారు. చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవార్డు రావడం పట్ల వైద్య సిబ్బందిని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.



Updated Date - 2022-06-25T05:58:27+05:30 IST