జాతీయ స్థాయి షూటర్ నమన్‌వీర్ సింగ్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-14T22:30:13+05:30 IST

భారత షూటర్ నమన్‌వీర్ సింగ్ బ్రార్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో

జాతీయ స్థాయి షూటర్ నమన్‌వీర్ సింగ్ ఆత్మహత్య

మొహాలీ: భారత షూటర్ నమన్‌వీర్ సింగ్ బ్రార్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మొహాలీలోని తన నివాసంలో తనకు తానుగా కాల్చుకుని మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 


ట్రాప్ షూటర్ అయిన నమన్‌వీర్ ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్ మినమిమ్ క్వాలిఫికేషన్ స్కోర్ (ఎంక్యూఎస్) కేటగిరీలో నాలుగో స్థానంలో నిలిచాడు. దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్ డబుల్ ట్రాప్ షూటింగులో కాంస్య పతకం సాధించాడు. 2013లో పటియాలాలో జరిగిన సర్దార్ సజ్జన్ మెమోరియల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించాడు. నమన్‌వీర్ సింగ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు.

Updated Date - 2021-09-14T22:30:13+05:30 IST