దారుణం... బయటపడ్డ ఏడు పిండాలు

Published: Sat, 25 Jun 2022 09:27:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దారుణం... బయటపడ్డ ఏడు పిండాలు

బెంగళూరు: కర్ణాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు. గుర్తించిన స్థానికులు తెరచి చూడగ అందులో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. ఈ విషయంలపై స్థానికులు పోలీసులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వాటిని భ్రూణహత్యలుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలల నిండిన శిశువుల పిండాలని గుర్తించారు.  


ఆ పిండాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.మహేష్ కోని ఈ ఘటనపై స్పందిస్తూ.. మొదట పిండాల లింగ నిర్ధారణ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఈ పిండాలను బెల్గావి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపిస్తామన్నారు. దీనిపై కొంతమంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తామన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.