33 కోట్ల మంది దేవుళ్లా?

ABN , First Publish Date - 2022-07-15T09:11:25+05:30 IST

33 కోట్ల మంది దేవుళ్లా?

33 కోట్ల మంది దేవుళ్లా?

సగం మనిషి, సగం జంతువులూ దేవుళ్లేనా?

అదిల్‌ చిస్తీ వివాదాస్పద వ్యాఖ్యలు


అజ్మేర్‌, హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి) జూలై 14: హిందూ దేవతలపై అజ్మేర్‌ దర్గాలో మరో మ త ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్‌, హనుమాన్‌ కూడా దేవుళ్లా?’’ అని అజ్మేర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గా అంజుమన్‌ కమిటీ కార్యదర్శి సయ్యద్‌ సర్వర్‌ చిస్తీ కుమారుడు అదిల్‌ చిస్తీ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో జూన్‌ 23న సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆదిల్‌పై కఠినచర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్‌ చేశాయి. అయితే, హిందూ సోదరసోదరీమణుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తాను బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మకు మాత్రమే ప్రశ్నలు వేశానని అదిల్‌ చిస్తీ మరో వీడియో విడుదల చేశారు. తన వీడియోలో కొంత భాగాన్నే చూపారని తెలిపారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటించారు. ఇక, జూన్‌ 17న అజ్మేర్‌ దర్గా గేటు వద్ద విద్వేష ప్రసంగం చేసి పరారీలో ఉన్న గౌహర్‌ చిస్తీని రాజస్థాన్‌ పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కాగా, నూపుర్‌ శర్మ తల నరికి తెస్తే బహు మతి ఇస్తానన్న అదే దర్గాకు చెందిన సయ్యద్‌ సల్మాన్‌ చిస్తీ జైల్లో ఉన్నాడు.



Updated Date - 2022-07-15T09:11:25+05:30 IST