ఆర్థిక నేరగాళ్లు రావాల్సిందే!

ABN , First Publish Date - 2021-11-19T08:52:28+05:30 IST

భారత్‌ విడిచి పారిపోయి న ఆర్థిక నేరగాళ్లు తిరిగి దేశానికి రావడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు..

ఆర్థిక నేరగాళ్లు రావాల్సిందే!

వారికి వేరే మార్గం లేకుండా చేస్తున్నాం

సంపద, ఉద్యోగాలను సృష్టించేవారికి

బ్యాంకులు అన్నివిధాలా అండగా నిలవాలి: మోదీ


న్యూఢిల్లీ, నవంబరు 18: భారత్‌ విడిచి పారిపోయి న ఆర్థిక నేరగాళ్లు తిరిగి దేశానికి రావడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. అలాగే.. సంపద, ఉద్యోగాల సృష్టికర్తలకు బ్యాంకులు అండగా నిలబడి.. వాటి బ్యాలెన్స్‌ షీట్‌తో పాటు దేశ బ్యాలెన్స్‌షీట్‌ను కూడా మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. ‘బిల్డ్‌ సినర్జీ ఫర్‌ సీమ్‌లెస్‌ క్రెడిట్‌ ఫ్లో అండ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌’ అనే అంశంపై గురువారం జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న ప్రధాని.. బ్యాంకర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆర్థిక నేరగాళ్లను తిరిగి తెచ్చేందుకు మేం విధానాలు,చట్టాలపై ఆధారపడుతున్నాం. దౌత్యమార్గాలను వినియోగిస్తున్నాం. వారికి మేమిచ్చే సం దేశం సుస్పష్టం. తిరిగి దేశానికి రండి..’’ అని మోదీ అన్నారు.


‘‘గత ప్రభుత్వాల హయాంలో ఎగవేతకు గురైన రూ.లక్షల కోట్ల రూపాయల్లో రూ.5 లక్షల కోట్లను మేం రికవర్‌ చేశాం’’ అని మోదీ పేర్కొన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ‘నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌ఏఆర్‌సీఎల్‌) ద్వారా మరో రూ.2 లక్షల కోట్లు రికవర్‌ చేయగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చే శారు. బ్యాంకుల సమస్యల పరిష్కారానికి 2014 నుంచి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వాటి ఆర్థిక ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉందన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనలో కీలకపాత్ర పోషించేంత పటిష్ఠస్థితిలో ప్రస్తుతం భారతీయ బ్యాంకులు ఉన్నాయని గుర్తుచేశారు. అప్పులు ఇచ్చే క్రమంలో వినియోగదారుల్ని దరఖాస్తుదారులుగా, తమను తాము అప్రూవర్లుగా భావించే పద్ధతికి బ్యాంకులు స్వస్తి పలకాలని.. భాగస్వామ్య విధానాన్ని అవలంబించాలని సూచించా రు. ‘‘వినియోగదారులు బ్యాంకుకు రావడం కోసం వేచిచూడకండి. మీరే వారి వద్దకెళ్లండి’’ అని పిలుపునిచ్చారు. అలాగే పెద్ద వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమస్యలకు వేర్వేరుగా పరిష్కారాలు కనుగొనాలని ప్రధాని సూచించారు. 2022 ఆగస్టు 15నాటికి డిజిటల్‌ విధానంలో కార్యకలాపాలు కొనసాగించే ప్రతి బ్యాంకు శాఖకూ కనీసం 100 మంది వినియోగదారులుండాలనే లక్ష్యాన్ని ప్రధాని విధించారు. బ్యాంకులకు బలమైన ‘క్యాపిటల్‌ బేస్‌’ సృష్టించేందుకు ఇటీవల తాము తీసుకున్న చర్యలను కూడా మోదీ వివరించారు.


దీంతో బ్యాంకులకు తగినంత లిక్విడిటీ ఉందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు గత ఐదేళ్లలో అతి తక్కువ స్థాయిలో ఉన్నాయని గుర్తుచేశారు. తద్వారా అంతర్జాతీయ ఏజెన్సీల దృష్టిలో భారతీయ బ్యాంకుల స్థాయి పెరిగింద న్నారు. ‘‘గడిచిన ఆరేడేళ్లలో బ్యాంకింగ్‌ రంగంలో మేం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల ఆ రంగం బలోపేతమైంది. బ్యాంకుల నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించాం. దివాలా చట్టాలు తీసుకొచ్చాం. డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ను బలోపేతం చేశాం’’ అని గుర్తుచేశారు. ‘జన్‌ధన్‌’ పథకాన్ని అమలు చేయడంలో బ్యాం కుల ఉత్సాహాన్ని ప్రధాని కొనియాడారు. దేశ అభివృద్ధి గాథలో భాగస్వాములు కావాలని బ్యాంకులకు పిలుపునిచ్చారు. ఉదాహరణకు తాము ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంతో ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి కృషిచేస్తున్నారని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం లో, భారతదేశం స్వయం సమృద్ధి సాధించడంలో బ్యాంకులు పెద్ద పాత్ర పోషిస్తాయని మోదీ పేర్కొన్నారు. భారత్‌ ఈ ఏడాది 100కు పైగా దేశాలకు ఆరున్నర కోట్లకుపైగా డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసినట్టు మరో కార్యక్రమంలో మోదీ అన్నారు.

Updated Date - 2021-11-19T08:52:28+05:30 IST