CM KCR: దేశంలో మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి..అశాంతిని సృష్టించేందుకు కుట్ర

ABN , First Publish Date - 2022-09-17T16:46:22+05:30 IST

నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌(Nampally Public Garden)లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు(National Unity Diamond Jubilee) ఘనంగా జరుగుతున్నాయి.

CM KCR: దేశంలో మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి..అశాంతిని సృష్టించేందుకు కుట్ర

Hyderabad: నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌(Nampally Public Garden)లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు(National Unity Diamond Jubilee) ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(State Chief Minister Kalvakuntla Chandrasekhar Rao) పాల్గొన్నారు. జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 1947 సెప్టెంబర్ 17న భారత్‌లో హైదరాబాద్‌ విలీనమైందన్నారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేనివన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించినట్టు చెప్పారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి.. ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు పయనించిందని కేసీఆర్(kcr) అన్నారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. 1948 నుంచి 1956 వరకు తెలంగాణ రాష్ట్రంగా ఉందని..  రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పేరిట..హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీలో కలిపారని వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారన్నారు. తెలంగాణ ప్రజలను ఏకం చేసి 14 ఏళ్లు పోరాటం చేశానని గుర్తు చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. ఇప్పుడు దేశానికే టార్చ్ బేరర్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయికంటే ముందుందన్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగిందన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని చెప్పుకొచ్చారు.


దేశంలో మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయని.. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే..సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని వాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మంటలు రగిలిస్తున్నాయని..ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదన్నారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరముందని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2022-09-17T16:46:22+05:30 IST