NATS బాలల సంబరాలు

ABN , First Publish Date - 2021-12-16T19:05:43+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్).. బాలల సంబంరాలు పేరిట 7 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

NATS బాలల సంబరాలు

డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్).. బాలల సంబంరాలు పేరిట 7 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనిలో భాగంగా సింగింగ్, డ్యాన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపీటిషన్, చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 18న (శనివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు(అమెరికా కాలమానం ప్రకారం) ఈ పోటీలు జరుగుతాయి. పోటీలు జరిగే వేదిక అడ్రస్ వచ్చేసి.. 300 చిషోలం, గ్రాండ్ సెంటర్‌, ప్లానో. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో www.natsworld.org/balala-registration లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 


రిజిస్ట్రేషన్ ఫీజు:

చెస్ పోటీలకు: నాట్స్ సభ్యులకు 15 డాలర్లు(రూ.1,142), ఇతరులకు 20 డాలర్లు(రూ.1523)

ఇతర పోటీలకు: నాట్స్ సభ్యులకు 10 డాలర్లు(రూ.761), ఇతరులకు 15 డాలర్లు(రూ.1,142)



Updated Date - 2021-12-16T19:05:43+05:30 IST