టెక్సాస్‌లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు 'నాట్స్' ఆహార పొట్లాల పంపిణీ

ABN , First Publish Date - 2020-07-28T18:16:13+05:30 IST

అమెరికాలో కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వ‌హిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు కృషి చేస్తోంది.

టెక్సాస్‌లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు 'నాట్స్' ఆహార పొట్లాల పంపిణీ

హ్యూస్టన్: అమెరికాలో కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వ‌హిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హ్యూస్టన్ విభాగం ఫోర్ట్ బెండ్ కౌంటీ, న్యాయమూర్తి కే.పి.జార్జ్... టెక్సాస్ జడ్జ్ కార్యాలయం అత్యవసర సిబ్బందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసింది. దాదాపు 100 మందికి పైగా సిబ్బందికి భోజనాలు సిద్ధం చేసి, ఆ ప్యాకెట్లను వారి కార్యాలయంలో అందించింది. 



నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సునీల్ పాలేరు, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కొల్ల, నాట్స్ హ్యూస్టన్ టీం చాప్టర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను, వీరూ కంకటాల, విజయ్ దొంతరాజు తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్య‌వ‌హ‌రించారు. కరోనాపై ముందుండి పోరాడే వారిని ప్రోత్సహించేందుకు నాట్స్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జ్ కేపీ జార్జీ ప్రశంసించారు.

Updated Date - 2020-07-28T18:16:13+05:30 IST