NATS ఆధ్వర్యంలో మినీ తెలుగు సంబరాలు!

ABN , First Publish Date - 2022-03-22T01:09:20+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS) డల్లాస్ బృందం.. ‘మినీ తెలుగు సంబరాలు’ పేరిట సాంస్కృతిక వేడుకను తలపెట్టింది.

NATS ఆధ్వర్యంలో మినీ తెలుగు సంబరాలు!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS) డల్లాస్ బృందం.. ‘మినీ తెలుగు సంబరాలు’ పేరిట సాంస్కృతిక వేడుకను తలపెట్టింది. టెక్సాస్ రాష్ట్రం ఇర్వింగ్ నగరంలోని టోయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ వేదికగా మార్చి 26న ఈ కార్యక్రమం జరగనుంది. మధ్యహ్నాం 2 నుంచి ప్రారంభమై..11.00 వరకూ జరిగే ఈ వేడుకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, మాజీ జెడ్‌పీటీసీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రముఖ నటీమణులు పాయల్ రాజ్‌పుత్, మెహ్రీన్ పిర్జాదా ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. తెలుగు వారందరూ ఈ సంబరాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు ఆహ్వానితులను ఉర్రూతలూగించేలా కామెడీ స్కిట్‌లు, నృత్య కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆధ్వర్యంలో జరిగే సంగీత కార్యక్రమంలో ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే.. కార్యక్రమానికి వచ్చే వారు తమ వెంట వ్యాక్సినేషన్ కార్డు తెచ్చుకోవాలని, లేని పక్షంలో సెంటర్ వద్ద ర్యాపిడ్ నెగెటివ్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందని నిర్వహకులు పేర్కొన్నారు. 



Updated Date - 2022-03-22T01:09:20+05:30 IST