అమెరికాలో ప్రారంభమైన మినీ తెలుగు సంబరాలు!

Published: Sun, 27 Mar 2022 18:18:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమెరికాలో ప్రారంభమైన మినీ తెలుగు సంబరాలు!

డల్లాస్(టెక్సాస్) మార్చ్ 26: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  ప్రతి రెండేళ్లకు ఒకసారి అమెరికాలో ఘనంగా నిర్వహించే తెలుగు సంబరాలను ఈమారు కోవిడ్ నేపథ్యంలో ‘మినీ తెలుగు సంబరాలు‘ పేరిట నిర్వహిస్తోంది. డాలస్ వేదికగా నిర్వహిస్తున్న ఈ తెలుగు సంబరాల్లో తొలి కార్యక్రమాన్ని ఇర్వింగ్‌లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో నిర్వహించారు. ఈ వేడుకల పరిచయ కార్యక్రమాన్ని (బ్యాంక్వెట్ ) శుక్రవారం  సాయంత్రం 6 గంటలకు ఇర్వింగ్ లోని SLPS కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. 

అమెరికాలో ప్రారంభమైన మినీ తెలుగు సంబరాలు!

మినీ సంబరాలకు ఆహ్వానితులుగా ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి, సినీ నటులు రవి, మెహ్రీన్, పూజఝవేరీ, సియా గౌతమ్ పాల్గొన్నారు.  నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె, చైర్ విమెన్ అరుణ గంటి, బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, పాస్ట్ ఛైర్మన్స్ శ్రీధర్ అప్పసాని, డా. మధు కొర్రపాటి, వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, పాస్ట్ ప్రెసిడెంట్స్ మోహనకృష్ణ మన్నవ, శ్రీనివాస్మంచి కలపూడి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, కిషోర్ కంచర్ల, ఆది గెల్లి, వీణ ఎలమంచిలి, డా. ఆచంట, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, రాజేష్ కాండ్రు, రంజిత్ చాగంటి, మదన్ పాములపాటి, జ్యోతి వనం, మురళీకృష్ణ మేడిచెర్ల, కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ ఆరికట్ల, మూర్తి కొప్పాక, భాను ధూళిపాళ, తెదేపా నాయకులు ముళ్ళపూడిబాపిరాజు, అరిమిల్లి నాగరాజు, డల్లాస్ ప్రవాసులు డా. ప్రసాద్ నల్లూరి, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, కే సిచేకూరి, కొర్రపాటి శ్రీధర్ రెడ్డి, చంద్రారెడ్డి, ఉప్పు వినోద్, సురేష్ మండువ, ఆత్మచరణ్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రవాస బాల బాలికల నృత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

తొలి రోజున కార్యక్రమ నిర్వహకులు..   ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలుగు సినీ కళాకారులు, గాయకులు  తమ ప్రతిభా పాటావాలతో తెలుగువారిని అలరించారు. ఇక.. తెలుగు సినిమా పాటలు ఆహుతులలో ఉత్సాహాన్ని నింపాయి.  నాట్స్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు,  జోనల్ ప్రెసిడెంట్లు, చాప్టర్ కో ఆర్డినేటర్లు తొలి రోజు జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. బావర్చీ వారి ప్రత్యేక విందు ఏర్పాట్లు అందరి మన్ననలను పొందాయి. శనివారం ఉదయం 9 గంటలకు అల్పాహారం తర్వాత మొదలైన బోర్డు, ఈసీ మీటింగ్‌లలో రాబోయే రెండు సంవత్సరాలలో నాట్స్ చేపట్టబోయే పలు కార్యక్రమాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కోవిడ్ బారి నుండి కోలుకున్న తర్వాత, 2023 జూన్ 30 నుండి జూలై 2 వరకూ 7వ అమెరికా తెలుగు సంబరాలను  న్యూజెర్సీలోని ఎడిసన్ రారిటన్ కన్వెన్షన్సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరుగనున్నట్లు బోర్డ్ చైర్‌విమెన్ ఆరుణ గంటి ప్రకటించారు. ఈ 7 వ అమెరికా తెలుగు సంబరాలకు పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా అరుణ గంటి మాట్లాడుతూ.. ‘భాషే రమ్యం, సేవే గమ్యం’ అన్న నాట్స్ నినాదానికి తగ్గట్టుగా ఎప్పటిలాగే తెలుగు వారంతా మరిన్ని సేవా కార్యక్రమాలలో తోటి ప్రవాసీయులకు అవసరమైనప్పుడల్లా ముందుండి సహాయపడుతూ, పలువురు కొత్త సభ్యులను నాట్స్ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా చేసుకొంటూ ముందుకు సాగాలని అన్ని చాఫ్టర్లకూ పిలుపునిచ్చారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.